ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం

Share this:

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని (డిసెంబర్ 10) పురస్కరించుకొని కాజిపేట్ లోని రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ హాల్లో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా NHRWCPC నేషనల్ చైర్మన్ అనంతుల శ్రీనివాస్ హాజరయ్యారు.మొదట బాబా సాహెబ్ బిఆర్.అంబేద్కర్ చిత్రపటానికి NHRWCPC చైర్మన్ శ్రీనివాస్,సభ్యులందరు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం NHRWCPC చైర్మన్ అనంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ డిసెంబర్ 10 1948 లో అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతీ మనిషి స్వేచ్ఛగా జీవించాలని,సంఘంలో గౌరవ మర్యాదలకు,వ్యక్తిత్వానికి ఎలాంటి భంగం వాటిల్లవద్దనే ఉద్దేశ్యంతో జాతి,మత,కుల,భాషా బేధాలు లేకుండా అందరూ సమానమే నన్న ఉద్దేశంతో ప్రపంచ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎవరి హక్కులకైనా భంగం వాటిల్లితే వారి హక్కుల సాధనలో NHRWCPC ముందుంటుందన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.మొహినుద్దీన్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు ఏ. పద్మావతి,ప్రధాన కార్యదర్శి జి. మాధవి,ఆర్గనైజింగ్ సెక్రటరీ భవాని,జిల్లా ఇంచార్జి మద్దెల శోభారాణి,కరుణ,ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎస్. రామ్మోహన్,ఎల్.రవీందర్ రెడ్డి, బొంద్యాలు అర్బన్ జిల్లా అధ్యక్షుడు త్రివిక్రం గౌడ్,రూరల్ జిల్లా అధ్యక్షుడు గోపు ప్రభాకర్,ప్రధాన కార్యదర్శి కాసగాని వేణుగౌడ్,ఆర్గనైజింగ్ సెక్రెటరీలు గనిపాక కుమార్,మహ్మద్ ఖాదర్ పాషా,సంధ్యారాణి,శిరీషా మాధవి,పర్వీన్ డాక్టర్ సునీత, గిరిప్రసాద్,ఎల్.ప్రకాష్, రాజకుమార్,రమణారెడ్డి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply