ఘనంగా రేపాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

Share this:

మునగాల(v3News): మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కృప కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికళ్యాణ మహోత్సవ సందర్భంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేడుకలతో భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెరుగుతుందన్నారు. భక్తిభావంతో ప్రజల మధ్య శాంతి సామరస్యాలు పెరుగుతాయన్నారు. ఆలయాల అభివృద్ధి వేడుకల్లో తన వంతు సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవాలను వేడుకలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ కి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ పొనుగోటి రంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తొగరు రమేష్ ,రైతు సమన్వయ అధ్యక్షుడు సుంకర అజయ్ కుమార్,మునగాల సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ,సోమపంగు సైదులు,
రేపాల ఎం పి టి సి మోహన్ పాల్గొన్నారు

Leave a Reply