చంగిస్ ఖాన్ పేట లో గల ఏఎంజి సంస్థ, లేప్రసి కాలనీ లో గల కుష్టు వ్యాధి గ్రస్తులకు కు చీరలు,దుప్పట్లు, పండ్లు పంపిణీ

Share this:

చిలకలూరిపేట నియోజకవర్గం, ఎడ్లపాడు మండలం, చంగిస్ ఖాన్ పేట గ్రామంలో గల ఏఎంజి సంస్థ, లేప్రసి కాలనీ లో గల కుష్టు వ్యాధి గ్రస్తులకు కు చీరలు,దుప్పట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ వీర మహిళ కోటేశ్వరమ్మ గారి మనవరాలు,సాధినేని విష్ణు ప్రియ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో, 50 కుటుంబాల కుష్టు వ్యాధి గ్రస్తులకు బట్టలు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేయటం, పేదలకు కష్ట సమయాల్లో వారికి తోడుగా ఉండటం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పనిచేయటం చాలా సంతోషకర మనీ అన్నారు. ఇలాగే పేద ప్రజలకు కష్ట సమయాల్లో తోడుగా ఉండాలని దానికి చిలకలూరిపేట జనసేన పార్టీ పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అచ్చు కోలా బ్రహ్మ స్వాములు, మునీర్, పసుపులేటి సాయి, మునీర్ , కాకుమాను రమేష్, భాష, గళ్ళ పూర్ణచంద్రరావు, నాని, కోసనపిచ్చయ్య, కుంచనపల్లి సాంబశివరావు, లీలా కిషోర,మల్ల కోటి, అమరేశ్వరి, యోబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply