చట్ట వ్యతిరేక పనులు చేస్తే పీడీ యాక్ట్ తప్పదు- ఏఎస్పీ కిరణ్ కారే నిర్మల్ జిల్లా
Share this:
లోకేశ్వరం మండలం నగర్ గ్రామంలో గత సోమవారం నాడు జరిగిన ట్రాక్టర్,ఆటో రెండు వాహనాలను అదే గ్రామానికి చెందిన కొత్తూరు శ్రీనివాస్ అనే వ్యక్తి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో నిప్పు పెట్టి , ధ్వంసం చేసి పారిపోయాడు, అతని ఆచూకీ కొరకు వెతుకు లాడిన రెండు పోలీస్ బృందాలు 48 గంటల్లో నిందితుడు శ్రీనివాసుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బైంసా ఏ ఎస్పి కిరణ్ కారే మాట్లాడుతూ కొత్తూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇదివరకే లోకేశ్వరం, కుంటాల పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో నిందితుడిగా పలుమార్లు రిమాండ్ కు వెళ్లి రావడం జరిగిందని , లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో 2020 సంవత్సరం లో రౌడీ షీట్ రిజిస్టర్ అయ్యిందని, రెండు వాహనాల నిప్పు పెట్టి దగ్ధం చేసిన తాజా కేసులో నిందితుడిని వెతుకు లాడిన పోలీసులు సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో రెండు బృందాలుగా వెతికి 48 గంటల్లో అరెస్టు చేశారు . నిందితుడిపై తాజా కేసులో IPC 307,435 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. గ్రామాలలో ఇలాంటి చేసినట్లయితే పి డి యాక్ట్ ప్రకారం చర్యలు చేపడతామన్నారు. గ్రామ సర్పంచులు సీసీ కెమెరాలు గ్రామంలోని కూడలిలో పెట్టినట్టయితే సిసి ఫుటేజ్ లు పోలీసులకు ఉపయోగపడతాయని తెలిపారు. వెనువెంటనే నిందితుడిని 48 గంటల్లో పట్టుకున్న సిఐ వినోద్ రెడ్డి, ఎస్ ఐ జి సాయికుమార్ లను అభినందించారు.