చాగలమర్రిలో దసరా మహోత్సవాలు

Share this:

కర్నూల్ జిల్లా చాగలమర్రి గ్రామంలో దసర మహోత్సవాల సంధర్బంగా 7వ రోజు మధ్యాహ్నం వేద బ్రాహ్మణులచే కుంకుమార్చన కార్యక్రమం అనంతరం దున్నపోతుని తీసుకోని చౌడేశ్వరి ఆలయం వద్ద ఏర్పాటు చేసి అక్కడి నుంచి అమ్మవారిశాల వరకు ఊరేగింపుగా అంగరంగ వైభవంగా కనులవిందుగా చేసిన కార్యక్రమం. రాత్రి మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారు.ఆలయ అధ్యక్షుడు వంకధార లక్ష్మణ బాబు ధర్మకర్త క్రిష్ణం శివప్రసాద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యములో సాయంత్ర వేళలో ఆర్యవైశ్య సభ వారి ఆద్వరములో మహిళలచే శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిపించారు. రాత్రి వేళలో పుల్లేటికుర్తి రాధాకృష్ణ పూజారి విశేష హారతులు ఇవ్వడం జరిగింది అనంతరం తీర్థ ప్రసాదాలు పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాసవి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వంకధార లక్ష్మణ బాబు కమిటీ సభ్యులు , శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు సుబ్రమణ్యం (బాబు) కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply