చిట్యాల మున్సిపాలిటీలో డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ గారి 65 వర్ధంతి

Share this:

బిఎస్పీ చిట్యాల మండల కమిటీ యకరి కవిత ఆధ్వర్యంలో జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ గారి 65 వర్ధతిని పురస్కరించుకుని ఆ మహానుబావునికి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి పాల్గొన్నారు.అనంతరం మాట్లాడుతూ అంబెడ్కర్ ఆశయాలను సాధిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా . అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన మన దేశానికి అందించిన రాంజ్యాంగం ప్రపంచ దేశాల్లో అత్యున్నతంగా నిలిచిందని తెలిపారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన చూపిన రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తోందన్నారు. అంబేద్కర్‌ విలువల్ని ప్రపంచం అంతా స్మరించుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సత్యశోదక్ సమాజ్ కమిటీ అధ్యక్షులు గాదె లింగస్వామి,సీనియర్ లీడర్ గ్యార మరయ్య, బిఎస్పీ నియోజకవర్గ మహిళ కన్వీనర్ పోకల ఎలిజబెత్,నియోజకవర్గ ఎర్రసాని జంగయ్య, మండల కన్వీనర్ ఎర్రసాని బాబు, మండల మహిళ కన్వీనర్ గాదె గీత ,ప్రశాంత్ ,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply