చిలకలూరిపేటలో జనసేన పార్టీ మీడియా సమావేశం

Share this:

చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట రాజారమేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈనెల 12వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయం నందు నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని తొలుత కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి లేఖ ఇచ్చారని తెలిపారు. గత నెల అక్టోబర్ 31న చలో వైజాగ్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను,అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి కార్మికులకు అండగా నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట నుంచి వేలాదిగా ప్రజలు పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అచ్చు కోలా బ్రహ్మ స్వాములు, మల్ల కోటి, అమరేశ్వరి, ఖాదర్ భాషా, పసుపులేటి సాయి, సాయి బుజ్జి, యోబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply