చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

Share this:

చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు మరియు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు, వీర మహిళలకు, మెగా అభిమానులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరపున, జనసేన పార్టీ తరఫున, నా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. గడిచిన రెండేళ్లలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టాలలో ఉన్నటువంటి ప్రజలకు తోడుగా నిలిచారని, వచ్చే రెండు రెండు సంవత్సరాలలో జనసేన పార్టీని బలోపేతం చేయవలసిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మనందరిపై ఉందని అన్నారు. కష్టాలలో ఉన్నటువంటి ప్రజలకు తోడుగా ఉంటూ, జనసేన పార్టీని బలపరుస్తూ వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అయ్యేదాకా నిరంతరం కృషి చేయాలి అని అన్నారు. ప్రజలందరికీ ఆ దేవుడు అష్ట ఐశ్వర్యాలు, నిండు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుభాని, చిలకలూరిపేట మండల అధ్యక్షులు పటాన్ ఖాదర్ భాష, నాదెండ్ల మండల అధ్యక్షుడు కొసనపిచ్చియ, మునీర్, హనుమంతరావు, రామారావు,పసుపులేటి సాయి, మల్ల కోటి, యోబు, కరిముల్లా, అచ్చు కోలా శేషు,పెద్దింటి సుమలత, అమరేశ్వరి కోటేశ్వరమ్మ, సాయి బుజ్జి, వెంకట్, బైరా భాను తేజ, ప్రకాష్ మరియు జనసేన పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply