చిలకలూరిపేట శ్రీగంగాపార్వతి సమేత ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో శ్రీకాలాష్టమి పూజలు
Share this:
చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రాసెంటర్ శివాలయంలో కాలష్టమిని పురస్కరించుకుని కాలభైరవునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్‌కుమార్ శాస్త్రి విశేష అర్చనలు చేశారు. శ్రీకాలభైరవస్వామి ఆవిర్భవించిన కార్తీక బహుళ అష్టమిని కాలభైరవాష్టమి గా సంభావిస్తారని అర్చకులు తెలిపారు. పట్టణంలోని చౌత్రాసెంటర్ శ్రీగంగాపార్వతి సమేత ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో శ్రీకాలాష్టమి పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు కాలభైరస్వామి పుట్టకు … కాలభైరవుని ప్రత్యేకతలు తెలిపారు. బ్రహ్మదేవుడు శివుడిని తూలనాడడంతో శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు అని ఆలయ అర్చకులు వారణాసి శరత్‌కుమార్ శాస్త్రి వెల్లడించారు. కాలభైరవుడు జన్మించిన రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యంతో ఉంటారని తెలిపారు. పట్టణ …పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు కాలాష్టమి పూజల్లో పాల్గొన్నారు. స్వామివారిని పూజించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.