చేవెళ్ల నియోజకవర్గం లో మంత్రుల సుడిగాలి పర్యటనలు

Share this:

చేవెళ్ల(V3News): రాష్ట్రమంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ,సబితా ఇంద్రారెడ్డిలు చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, చేవెళ్ల , శంకర్ పల్లి మండలాల్లో పర్యటించి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య లతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు , వికారాబాద్ జిల్లా నవాబ్ పెట్ మండలంలోని గుబ్బడి పత్తేపూర్, గంగ్యడా , నరేగుడా , అత్తాపూర్, అకనపూర్ , చించల్ పెట్ గ్రామాలలో పర్యటించిన వారు బిటి రోడ్లు, సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, అనంతరం ఎమ్మెల్యే కాలే యాదయ్య సతీమణి నవాబ్ పెట్ మండల zptc జయమ్మ పుట్టినరోజు సందర్భంగా వారి స్వగ్రామం చించల్ పెట్ లో కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ సునితా మహేందరెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ అనిత రెడ్డి, వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, మొయినాబాద్ zptc కాలే శ్రీకాంత్, నవాబ్ పెట్ zptc కాలే జయమ్మ, నవాబ్ పెట్ mpp కాలే భవాని, వైస్ mpp బందయ్య గౌడ్, నవాబ్ పెట్ మండల TRS పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply