జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Share this:

రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రప్రభుత్వం,రాష్ట్రంపై నెపం నెట్టి కేంద్రప్రభుత్వం ఇరు ప్రభుత్వాల సమన్వయ లోపంతో రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.ఖరీఫ్ పంటకు భారత ఆహార సంస్థ ద్వారా తీసుకుంటామని కేంద్రం తెలిపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో తూకం,రవాణా,అన్ లోడ్ జాప్యంతో కళ్ళాల్లో పోసిన ధాన్యం 50శాతం మాత్రమే తూకం మయ్యాయని ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి కొనుగోలు వేగవంతం చేపట్టాలన్నారు.రబీ పంటపై నిర్మాణాత్మకమైన ప్రణాళిక లేకుండా ఆరుతడి పంట మార్పిడి సరే కానీ మద్దతుధర మాటేంటని ప్రశ్నించారు.రాష్ట్రంలో 1కోటి50లక్షల ఎకరాలకు రూ 2500కోట్లు రైతుబంధు చెల్లిస్తే 50లక్షల ఎకరాలు మాత్రమే పంట సాగు జరిగిందన్నారు.సాగు లేని భూస్వాములకు పెట్టుబడి సాయం నిలిపివేసి పండించిన వరి పంటకు రూ,200,మొక్కజొన్న,పప్పుదినుసులు, నూనె గింజలు ఇతర పంటలకు రూ, 500 బోనస్ అందించి రైతులను ఆదుకోవాలన్నారు.విదేశీ మారక ద్రవ్య రూపంలో గల్ఫ్ కార్మికుల కష్టాలతో రాష్ట్ర ఖజానాను నింపుకుంటున్న తెరాస ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు.రైతు బీమా మాదిరిగానే ఉపాధి కూలీలకు గల్ఫ్ కార్మికులకు బీమా పథకం అమలు చేసి 5లక్షల ఎక్స్గ్రేషియా అందించిన ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యెడి మహిపాల్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షాకీర్,నాయకులు మ్యాకల రమేష్,బాపురపు నర్సయ్య,మండ రమేష్,బత్తిని భూమయ్య ,మున్ను,బిట్ల నర్సయ్య,రాకేష్ నాయక్,మసూద్,నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply