జనతా కర్ఫ్యూ విజయవంతం

Share this:

దేశ ప్రధాని మోదీ పిలుపుమేరకు దేశం మొత్తం విశేష స్పందన లభించింది. మరోసారి ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా దేశ ప్రధాని చేయటం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన వైరస్ ను రెండో దశ లోనే అదుపు చేయడం పై భారతదేశ ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ఆదిలోనే వైరస్ ను అంతం చేయాలనే దృఢ సంకల్పంతో దేశ ప్రధాని పిలుపు ఇచ్చారని ఆ పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి ఎంతగానో ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భారత్ బంద్, రాష్ట్ర బందు పిలుపులో సైతం లెక్కచేయని పరిస్థితుల్లో జనతా కర్ఫ్యూ జనం ఎవరూ కూడా రోడ్లపైకి కనిపించని పరిస్థితి నేడు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రహదారులు సైతం వీధి రహదారులను కూడా ఎవరు ఇంట్లో నుండి జనం బయటకు వచ్చిన పరిస్థితి కనిపించడం లేదు. ఆర్టీసీ రైతు బజార్లు మూసివేయడంతో స్వచ్ఛందంగా దుకాణ యజమానులు కూడా ఎక్కడ షాపులో తెరవని పరిస్థితి కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రహదారుల్లో ఎక్కడెక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటుచేయడంతో పలు వరకు పోలీసులు మాస్క్ ధరించడం ఈ రోజు బయటకు తిరగకూడదు అన్న సంకేతాలు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ స్వచ్ఛందంగా కరోనా వైరస్ పై యుద్దాన్ని ప్రకటించడం ఒక్క పిలుపు ఇంత భారీ స్పందన రావడం ఇదే మొదటిసారి గా చెప్పుకోవచ్చు.

Leave a Reply