జాతీయస్థాయిలో గౌతమి విద్యార్థుల ప్రతిభ

Share this:

జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన బైంసా గౌతమిహై స్కూల్ విద్యార్థులను బుధవారం ముధోల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అభినందించారు. నవంబరు 27, 28, 29, తేదీలలో యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గోవా లోని మడగావ్ లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలో మణికంఠ (9వ తరగతి), సెటిల్ బ్యాట్మెంటన్ లో ఆదిత్య(9వ.తరగతి )లు మంచి ప్రతిభ కనబరిచి బంగారు పథకాలను సాధించారు. దీంతో ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థుల ప్రతిభకు అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సంజు, ప్రిన్సిపాల్ రాందాస్, సుదీప్, ఖాలీద్, ఎస్.కె మహబూబ్బాషా, ఎండి ముజీద్ హైమద్, సలాహోద్దీన్, తదితరులు ఉన్నారు.

Leave a Reply