జాతీయస్థాయి టగ్ అఫ్ వార్ పోటీలకు ఎంపిక అయి జాతీయ స్థాయి పోటీలలో పథకాలు సాధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా యువకులు

Share this:

జాతీయ స్థాయిలో జరిగిన టగ్ అఫ్ వార్ పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ముగ్గురు యువకులు సీనియర్ మెన్ కేటగిరిలో బి.ప్రణయ్ గౌడ్, అండర్ 19 కేటగిరిలో జి హేమంత్, అండర్ 17 కేటగిరి లో జి ప్రతీష్ ఎంపిక కావడం జరిగింది.మహారాష్ట్ర లోని పాల్గర్ లో నవంబర్ లో జరిగిన 34వ జాతీయ ఛాంపియన్ షిప్ లో సీనియర్ పురుషుల మరియు మహిళల 34 వ జూనియర్,23 వ సబ్ జూనియర్ మరియు మినీ జూనియర్ టగ్ అఫ్ వార్సీనియర్ పురుషుల ఇండోర్ కేటగిరీ లో ప్రణయ్ సిల్వర్ మెడల్ మరియు అవుట్ డోర్ కేటగిరీ లో ప్రతీష్ బ్రోంజ్ మెడల్ సాధించారు. వీరికి గౌరవ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రాష్ట్ర ఒలంపిక్ సెక్రెటరీ జగదీష్ యాదవ్ గారు హైదరాబాద్ లో మెడల్స్ ఇచ్చి సత్కరించారు. ఇలాగే జిల్లాలో ఇంకా క్రీడాకారులను తయారుచేసి జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తేవాలని తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా టగ్ అఫ్ వార్ ప్రధాన కార్యదర్శిని గొట్టే శివకృష్ణ నీ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
ప్రస్తుతం వీరు యువ ఫౌండేషన్ నందు పోలీస్ మరియు ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటూ ఈ ఎంపిక కావటం పట్ల యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.వీరిని వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సత్కరించి అభినందించారు.

Leave a Reply