డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించాలి- బీజేపీ బోధన్ మండల శాఖ అధ్యక్షుడు పోశెట్టి

Share this:

బోధన్ మండలం లోని అమ్దా పూర్ గ్రామంలో డబుల్ బెడ్రు మ్ ఇండ్లు కట్టి సంవత్సరాలు గడుస్తున్న గ్రామంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రుమ్ ఇండ్లు కేటాయించక పోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని వెంటనే గ్రామ శివారులో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించాలని బీజేపీ బోధన్ మండల శాఖ అధ్యక్షుడు పోశెట్టి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో అమ్దా పూర్ గ్రామంలోని రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పటేల్ పాల్గొన్నారు..వారు మాట్లాడుతూ అమ్దా పూర్ గ్రామప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే గ్రామంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని అన్నారు శిథిలావస్థకు చేరిన డబుల్ బెడ్రుమ్ ఇండ్లను పర్యవేక్షించారు నాణ్యత రహితంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట చెబుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన క్రింద నిధులిస్తే వాటిని డబుల్ బెడ్రు మ్ నిర్మాణానికి మళ్లించి కమిషన్లకు కకృత్తి పడి నాణ్యతలేని నిర్మాణాలు చేస్తున్నావని అన్నారు. అమ్దా పూర్ గ్రామం లోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రుమ్ ఇండ్లు మంజూరు చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అమ్దా పూర్ గ్రామ బీజేపీ, బిజెవైఎం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply