డిసంబర్ 27,28,29 తేదీల్లో గుంటూరు జిలాల్లో సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు

Share this:

రేపల్లె టౌన్… గుంటూరు జలాల్లో జరిగే సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలుని జయప్రదం చేయండి.. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం.రామారావు గారు పిలుపునిచ్చారు.. మహాసభలు జయప్రదం కోసం సన్నాహక సమావేశం సీపీఎం కార్యాలయంలో సీపీఎం రేపల్లె పట్టణ కమిటీ సభ్యులు కె.ఆశ్విరాధం అధ్యక్షతనా జరిగింది.ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం.రామారావు గారు మాట్లాడుతూ సిపిఎం 26 రాష్ట్ర మహాసభలు గుంటూరు జిల్లా తాడేపల్లిలో డిసంబర్ 27,28,29 తేదీల్లో గుంటూరు జిల్లాలో 36 సంవత్సరాలు తర్వాత రాష్ట్ర మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో రేపల్లె ప్రాతంలో ప్రజానీకం తోడ్పాటు ఇచ్చి జయప్రదం చేయాలిని పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేస్తున్న సిపిఎంను ఆదరించాలి అని కోరారు. దేశవ్యాప్తంగా సీపీఎం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నది. కార్పొరేట్ సంస్థలకు దేశాని అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు పై మరియు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతులు పోరాటంలో సీపీఎం కీలకమైన పాత్ర సీపీఎం పోషిస్తుంది.రాష్ట్రంలో అభివృద్ధి పక్కకు పోతూ సంక్షేమ పథకాలు అమలు చేయటం కోసం బారాలు వేస్తున్నారు,ట్రూ ఆఫ్ విద్యుత్ చార్జీలు,ఒన్ టైం రిజిస్ట్రేషన్ పేరుతో 8000 కోట్లు వసూలు చేయటం,పట్టణాల్లో ఆస్తిపన్ను,చెత్త పన్ను వసూలు చేయడం లాంటి భారాలు తగ్గిచాలని.అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ఉద్యోగ, కార్మిక,రైతు,విద్యార్థి అని తరగతులు ప్రజలు సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా జరుగుతున్న మహాసభలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్.మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె వామపక్ష ఉద్యమాలు ప్రభావం కలిగినా ప్రాంతం.ప్రజా ఉద్యమాలు సీపీఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జయప్రదంకి తోడ్పాటు ఇవ్వాలని అన్నారు. మహాసభలు నేపథ్యంలో డిసెంబర్ 27వ తేది జరిగే ప్రారంభసభకు రేపల్లె నియోజకవర్గ పరిధిలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ మహాసభలు నేపథ్యంలో గుంటూరు జలాల్లో ఇంటింటికి సిపిఎం రాష్ట్ర మహాసభల ప్రచారాన్ని జయప్రదం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో సీపీఎం చేరుకుపల్లి మండలం కార్యదర్శి కె.శరత్,నగరం మండలం కార్యదర్శి కె.గోపి,నాయకులు ఏవిపికె.సుబ్రహ్మణ్యం,వై. కిషోర్,స్టాలిన్,ఆదర్శ,కెవి. లక్ష్మణరావు,ఐ.లీల కోటేశ్వరరావు,బి.నాగరాజు,జె. ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply