డోన్ పట్టణంలో వరుసగా మూడు ఇళ్లలో దొంగల హల్ చల్

Share this:

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని వై.ఎస్.ఆర్ నగర్ నందు ఈ రోజు అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి వరుసగా మూడు ఇళ్లలో దొంగలు చోరికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే ఒక ఇంటి లో శుభకార్యం కి వెళ్లారు.
మరో వ్యక్తి ఇంటి పైన నిద్రిస్తున్నాడు. మరొకరి ఇంటిలో (వ్యక్తిగత పన్ని కొరకు) పెళ్లి కీ వీడియో కవరేజ్ చేసేందుకు వేరే గ్రామానికి వెళ్లగా ఎవరు లేని సమయం చూసి అర్ధరాత్రి వరుసగా మూడు ఇళ్లలో దొంగలు చోరి చేసి తమ పని కానిచ్చుకొని వెళుతుండగా ఇంటి పైన నిద్రిస్తున్న వ్యక్తి చూడడంతో అతను ఇరుగు పొరుగు వాళ్లని పిలిచి వెంబడించి ముగ్గురు దుండగులని పట్టుకొని పోలీసులకు అప్పగించామని బాధితులు తెలిపారు.

Leave a Reply