తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ము.కా. స్టాలిన్ గారిని కలిసిన నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆర్.కె.సెల్వమణి

Share this:

చెన్నై ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రత్యక్షంగా కలిసి నగరి నియోజకవర్గమునకు సంబంధించిన సమస్యలతో పాటు మన ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న తమిళుల సమస్యలను విన్నవించారు వాటిలో ప్రధానంగా…

1) ఆంధ్రప్రదేశ్ లో ఉండి తమిళ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు తమిళ పాఠ్యపుస్తకాలు (మెట్రిక్యులేషన్ సిలబస్ ) ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక్కొక్క తరగతి కు 1000 చొప్పున మంజూరు చేయాలని కోరారు

2) ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా సుమారు 5 వేల ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న కొసలనగరం పారిశ్రామిక పార్క్ నకు తమిళనాడు నుంచి పరిశ్రమలు రావడానికి,భారీ వాహనాల ట్రాన్స్పోర్టేషన్ రాకపోకలకు అనువుగా నేడుంబరం – అరక్కోణం రోడ్డు NH 716 నుంచి ఇండస్ట్రియల్ పార్కు చేరడానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు కోరారు.మరియు ప్రతిపాదనలు

3) అతి ప్రధానంగా ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాలలో హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ కార్మికులు ఒక కోటికి పైగా ఉన్నారని కరోనా తర్వాత ప్రపంచ దేశాలు Textiles ను చైనా దేశం నుండి దిగుమతి చేసుకోకపోవడం కారణంగా ప్రపంచం యొక్క Textiles అవసరాలను మన దక్షిణ భారత దేశం లోని చేనేత మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించడం ద్వారా ప్రపంచ దేశాల అవసరాలను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన ప్రతిపాదనలు మన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా గతంలో చర్చించామని దీనిపై తగు సూచనలు, చర్యలు తీసుకోవాలని వివరించారు

4) అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నివాసముంటున్న తమిళ కుటుంబీకులు చెన్నై మహానగరం తోనూ తమిళనాడులోని ప్రధాన పట్టణాల్లోనూ బంధుత్వ పరంగా అయినా, వ్యాపారపరంగా అయినా చాలా ఎక్కువ లావాదేవీలు కలిగి ఉన్నారని, అటువంటి వారికి తమిళనాడులో జనరల్ హాస్పిటల్స్ లో తమిళ్ నాడు ప్రభుత్వ పౌరుడుకు ఉన్న సౌకర్యాలు అన్నింటిని కూడా చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఉన్న తమిళ కుటుంబీకులకు కూడా అదే సౌకర్యాలను వర్తింపజేయాలని విన్నవించారు.

ఈరకమైన ప్రజలకు ఉపయోగపడే ప్రతిపాదనలను ఎప్పటికీ స్వాగతిస్తామని, వీటిని పరిశీలించి తగు చర్యలు తొందరగా తీసుకుంటామని గౌ
తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ స్టాలిన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారికి, రాయలసీమ వీవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెల్వమణి కి హామీ ఇవ్వడం జరిగింది.

Leave a Reply