తిరుమల శ్రీవారికి తమిళనాడు భక్తుని భూరి విరాళం

Share this:

తిరుమల V3 న్యూస్ రిపోర్టర్:శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు రెండు కోట్ల రూపాయల విలువైన శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చి భక్తి చాటుకున్నాడు. తేనె కు చెందిన స్వామివారి భక్తుడు తంగదొరై మూడున్నర (3 1/2) కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు చెప్పారు. ఈ ఉదయం టీటీడీ అదనపు ఈవోకు వీటిని అందజేశారు. కాగా, తంగదొరై గతంలోనూ శ్రీవారికి బంగారు, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చారు. అందులో బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు ఉన్నాయి.

Leave a Reply