తెలంగాణప్రజల తీరుపై ప్రభుత్వం సీరియస్.. ఇక రోడ్లపై కనిపిస్తే అంతే సంగతులు

Share this:

హైదరాబాద్: రాష్ట్ర ప్రజల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. కరోనా వైరస్ నియంత్రణకై ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వ ప్రకటనను ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇష్టారీతిన రోడ్లపై సంచరిస్తున్నారు. గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ అమలుపై సీఎస్‌, డీజీపీ అత్యవసర సమావేశం అయ్యారు. లాక్‌డౌన్‌ పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను పాటించని వారిపై కేసుల నమోదుకు ఆదేశాలు జారీచేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రజాహితానికై చేపట్టిన బంద్‌కు సహకరించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు

Leave a Reply