మాజీమేయర్ బొంతు రామ్మోహన్ పై కేసు

Share this:

హైదరాబాద్ నగర మాజీమేయర్ బొంతు రామ్మోహన్ పై కేసు నమోదైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఘట్ కేసర్ పోలీసులు వెల్లడించారు. తరచూ భూ వివాదాల్లో తలదూరుస్తూ.. సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఆయనపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. నేరపూరిత కుట్ర, చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఘట్ కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నంపేటలో 11 ఎకరాల దళితుల భూముల వ్యవహారంలో కలుగజేసుకున్నారని బొంతుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి మరియాల తిరుమలరెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి.

Leave a Reply