దళిత బందు లబ్దిదారులకు ట్రాక్టర్లు, క్యారాజి వాహనాల పంపిణీ

Share this:

భీమ్‌గల్(V3News)07-04-2022: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం దళిత బందు ద్వారా దళిత సమాజాన్ని తలెత్తుకునేలా చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రొడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి లక్ష్యమని ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి మండల అధ్యక్షుడు నరసయ్య అన్నారు. బుధవారం దళిత బందు లబ్దిదారులకు ట్రాక్టర్లు, క్యారీ వహనాలను పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్యతో కలిసి పంపిణీ చేశారు. దళితుల జీవితాలలో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దళిత బందు పథకంపై ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దళిత బందు చారిత్రాత్మక పథకంగా నిలిచిపోతుందని చెప్పారు. ఈ పథకం అమలు చేయడం ద్వారా దళిత సమాజం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజక వర్గ సమన్వయ కమిటీ సభ్యులు గుణ్వీర్ రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, రైతు బందు అధ్యక్షుడు శర్మనాయక్, సూర్జిల్, జడ్పి కోఆప్షన్ నెంబర్ మోయిస్, నాగేశ్, హన్మచారి, ఎంపీటీసీ సుమలత రాజేశ్వర్, ఎర్రొల్ల సంజీవ్, అకుల గంగాధర్, ఆరే రవిందర్, బుర్ర దెవెందర్ గౌడ్, బొదిరే తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply