దళిత బందు లబ్ధిదారులకు కలెక్టర్ కార్యాలయంలో అవగాహన సదస్సు

Share this:

పరకాల నియోజకవర్గ దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హgనుమంతు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని అందులో భాగంగా దళిత బందు ప్రవేశపెట్టారని చెప్పారు దేశం మొత్తం ఈ పథకం వైపు చూస్తున్నారు అన్నారు లబ్ధిదారులు వారికి అనుకూలమైన యూనిట్ ఎంపిక చేసుకోవాలని లాభసాటి వ్యాపారం చేసే విధంగా ఆ యూనిట్ ఉండాలని అన్నారు అధికారులు ఎప్పటికీ సిద్ధంగా ఉండాలని అన్నారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ తూ.గో దళిత బందులో ఎలాంటి ఇబ్బందులు ఉన్న అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు పది లక్షల రూపాయల విలువల యూనిట్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే గ్రూపులుగా ఏర్పడి ఉండవచ్చని అన్నారు అక్కడికి వచ్చిన లబ్ధిదారులకు సంబంధిత శాఖల అధికారులకు మధ్య వివరాలు సందేహాలు సమాధానాలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల సిబ్బంది మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు

Leave a Reply