దివ్యాంగులు ధృఢచిత్తాన్ని అలవర్చుకోవాలి-కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

Share this:

  • సమస్యల పరిష్కారం కోసం నేరుగా సంప్రదించవచ్చు
  • బాలికల వసతి గృహ మరమ్మతు కోసం చర్యలు
  • నెలాఖరులోగా బ్యాక్ లాగ్ ఉద్యోగాల నియామక ఉత్తర్వుల జారికి చర్యలు
  • ఉన్నతస్థితి నుండి అత్యుత్తమమైన స్థితికి ఎదగాలంటే ప్రయత్నం వైపు మనసు మల్లించడానికి దివ్యాంగులు ధృఢ చిత్తం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయో వృద్ధుల శాఖ జిల్లా సంక్షేమ అధికారి ఎం.సబిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన- మాట్లాడుచూ ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసమే సృజనాత్మకతను వెలికి తీస్తుందని, ఎటువంటి వైకల్యమైనా సంకల్పం ముందు దాసోహమేనని అన్నారు.
వైకల్యంతో మానసికంగా కృంగిపోతున్నవారు ఎంతో మంది ఉన్నారని, అయితే మనో సంకల్పం ముందు వైకల్యం అవరోధం కాదని, మనో ధైర్యమే విజయానికి అసలైన సాధనాలని అన్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం నేరుగా సంప్రదించినట్లైతే సంబంధిత శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు,
సంబంధిత బ్యాక్ లాగ్ ఉద్యోగాల నియామక ఉత్తర్వులు జారీ చేయుటకు డిసెంబర్ నెలాఖరు లోగా చర్యలు తీసుకుంటామని, బాలికల వసతి గృహంలో చేపట్టాల్సిన మరమ్మతు పనులు చేపట్టుటకు ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కి సూచించారు, ఇట్టి విషయంలో స్వచ్ఛంద సంస్థలు కూడా చొరవచూపాలని అన్నారు, దివ్యాంగుల పట్ల సానుభూతి కాకుండా సహానుభూతి మెలగాలని, వారికి సేవ చేయుటకు భాగస్వామ్య పద్దతిలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరినారు.
డీఆర్డీవో ఆకవరం శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అనేక సంక్షేమ శాఖ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 1766 మందికి జాబ్ కార్డులు జారీ, నమోదు చేసుకున్నవారు 2103, శ్రమశక్తి సంఘాలు114,తద్వారా ఉపాధి పొందిన దివ్యాంగ కూలీలు 540 మంది అని తెలిపారు.
జిల్లా సంక్షేమ అధికారి ఎం.సబిత మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన 11 మందికి ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం కింద అందించామని,27 మందికి రెట్రో ఫిట్టెడ్ మోటార్ సైకిళ్ళు పంపిణీ చేశామని,6 గురికి లాప్ టాప్ లు, 11మందికి ఫోర్ జీ మొబైల్స్ అందచేసామని అన్నారు.

Leave a Reply