దేశంలో అభివృద్ధి అన్నది అనువృత్తి నక్షత్రంలా తయారైంది-కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్

Share this:

దేశంలో అభివృద్ధి అన్నది అనువృత్తి నక్షత్రంలా తయారైందని విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కుప్పంలో మంగళవారం కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ కంట్రోల్ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైందని, రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన కోవిడ్ మొదటి వేవ్, రెండవ వేవ్ లో అధికారిక లెక్కల్లో 4లక్షలు అయినా, అనధికారికంగా ఒక కోటి మంది చనిపోయారన్నారు. దాదాపు 3 సంవత్సరాలు YCP ప్రభుత్వం ఆర్థిక పతనావస్థకు కు చేరిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన జీవిత భత్యాలు (PRC & DA) ఇవ్వకపోవడం, మరియు YCP MLCలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని విమర్శించడం, NTR విగ్రహాన్ని ధ్వంసం చేయడం పెద్ద పొరబాటు అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా రాష్ట్రానికి, చిత్తూరు కు, కుప్పానికి చంద్రబాబు చేసింది శూన్యం ఉన్నారు. జగన్, చంద్రబాబు లు CM అయ్యేందుకు ప్రయత్నాలు ఆపి, బలిజ, కాపులు రాష్ట్రంలో ఒక కోటి మంది ఉన్న వారికి CMగా ఇవ్వా లని చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply