దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా మన్యం లో కాంగ్రెస్ పార్టీ నిరసన ! కేంద్రం దిగొచ్చెంతవరకు పోరాటం ఆగదన్న పాచిపెంట శాంతకుమారి

Share this:

విశాఖ: విశాఖ ఏజెన్సీ అరకులోయ లో తేదీ11-06-2021 కరోనా మహమ్మారి తో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు అడ్డగోలుగా పెరుగుతున్నాయని గతంలో ఎన్నడూ లేనివిధంగా చమురు సంస్థలు ఆకాశమే హద్దు అన్నట్లు ధరలు పెంచుతూ పోతున్నాయని ఏపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ పాచిపెంట శాంత కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వంద రూపాయలు దాటిందని మరికొన్ని రాష్ట్రాలు, నగరాలలో వందకు చేరువైందని గడిచిన 13 నెలల్లో పెట్రోల్పై రూ.25.72లు, డీజిల్పై, రూ.23.93లు పెరిగినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందని. గడిచిన ఐదు నెలల్లో 43 సార్లు ధరలు పెరిగినట్లు పేర్కొన్నారు ధరల పెరుగుదల ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని దీని ప్రభావం ఇతర రంగాలపై కూడా పడినట్లు కాంగ్రెస్ ఆక్షేపించిందని ఆమె అన్నారు. అందుకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు తేది 11-06-2021న ఉ”11గం” కు పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐసీసీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను ఆదేశించిందని. ఈ మేరకు ఏపిసీసి అధ్యక్షులు డా” సాకే శైలజానాథ్ గారి ఆదేశాల మేరకు శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో అరకువేలి మండలాల పెట్రోల్ బంకు వద్ద స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలతో అందరూ కలిసి స్వచ్ఛందంగా పాల్గొని నిరసన కార్యక్రమం జయప్రదంగా నిర్వహించామని పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం దిగోచ్చేంత వరకూ పోరాటం ఆగదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఒలేశి బాబురావు కాంగ్రెస్ మండల కార్యదర్శి శెట్టి భగత్ రాం మండల అధ్యక్షులు సోమెలి సన్యాసిరావు గుబాయి ఆనంద్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ గుబాయ్ కళ్యాణ్ మూర్తి కిలో జొయో మండల మహిళా అధ్యక్షురాలు నోగెలి చంద్రకళ ఉల్లి నీలవేణి డుంబ్రిగుడ మండల కార్యదర్శి తడబారికి బీమరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అబిమాలులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply