దేశం లో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వని విధంగా రైతులకు రైతుబంధు

Share this:

దేశం లో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వని విధంగా రైతులకు రైతుబంధు ద్వారా 50 వేల కోట్ల రూపాయలు అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, రైతు బందు వారోత్సవాల లో భాగంగా లింగాల ఘణపురం మండలం నవాబుపేట గ్రామం లోని జడ్పిఎస్ఎస్ పాఠశాల లో జరుగుతున్న ముగ్గుల పోటీలో పాల్గొని వ్యాస రచన ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బూడిద జయ రాజేశ్వర్,ఆద్వర్యంలో బహుమతులు అందజేశారు. అనంతరం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ… సాదించుకున్న తెలంగాణ రాష్ట్రం లో బీడు భూములను పచ్చటి పంట పొలాలు గా మార్చిన ఘనత సీఎం కేసిఆర్ కే దక్కుతుందని, రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో సీఎం కేసిఆర్ రైతులకోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, రైతు బందు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంటు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు, ఈ కార్యక్రమంలో…ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్ రెడ్డి,జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు బస్వగాని శ్రీనివాస్,నాగేందర్,దూసరి.ఘణపతి, AMC డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు, బూడిది రాజు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply