దొంగ అరెస్ట్

Share this:

అనంతపురం:కళ్యాణ మండపాల్లో దొంగతనాలకు పాల్పడే దొంగఅరెస్టు సుమారుగా 18 లక్షలు విలువచేసే 46 తులాల బంగారు ఆభరణాలు మరియు 50 వేల రూపాయల నగదు స్వాధీనం ద్విచక్ర వాహనములు మరియు సెల్ఫోన్ స్వాధీనం హత్య చేసి ఆ కేసులో రాజీ పడేందుకు దొంగతనాలు చేసినట్లు వెల్లడి జిల్లా కేంద్రంలోని చంద్రబాబునాయుడు కొట్టాల కు చెందిన పాత నేరస్తుడు రామాంజనేయులు అలియాస్ రామాంజి అలియాస్ మహబూబ్బాషా అనంతపురం నగర పోలీసులు అరెస్టు చేశారు ఇతను ఒంటరిగా కళ్యాణ మండపాలలో దొంగతనాలు చేయడంలో దిట్ట కళ్యాణ మండపంలో ముందు రోజే చేరుకొని రిసెప్షన్ కార్యక్రమంలో అందరితో బంధువుల కలిసిపోతాడు విలువైన వస్తువులు ఎవరెవరు ధరించారు ఆ రాత్రి వాటిని ఎక్కడ ఉంచుతారో గమనించి పొద్దుపోయాక నిద్రపోయే సమయంలో తస్కరించి కూడా ఇస్తాడు ఇలా ఏ గత ఏడాది జూలై నుండి మూడు చోరీలకు పాల్పడ్డారు ఇంత కళ్ళు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ఇన్స్టిట్యూట్ ఫంక్షన్ హాల్ లో గత జూలై నెలలో దొంగతనం చేశాడు, ఆ తర్వాత అదే సంవత్సరం నవంబర్ నెలలో అనంతపురం నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ గేట్ ఫంక్షన్ హాల్ లో చోరీకి పాల్పడ్డాడు ఈ ఏడాది ఫిబ్రవరి 14న రాత్రి పొద్దుపోయాక అనంతపూర్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని టిటిడి కళ్యాణ మండపం లో దొంగతనం చేశాడు ఈ మూడు కేసులు సంబంధించి పోలీసులు 47 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గతములో అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరంలో జరిగిన విద్యార్థి బాల నాయక్ హత్య కేసులో నిందితుడు అతనితోపాటు మరో ఐదుగురు కలిసి అప్పట్లో చంపారు ఈ కేసు విషయంలో బాధితులతో రాజీ కావాలని అందుకు లక్షల రూపాయలు అవసరం అవుతుందని భావించి కళ్యాణ మండపాలలో దొంగతనాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పాత నేరస్థుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన అనంతపురం డీఎస్పీ జి వీర రాఘవరెడ్డి పర్యవేక్షణలో నగర సీఐలు రెడ్డప్ప కత్తి శ్రీనివాస్ జాకీర్ హుస్సేన్ ఎస్ ఐ లు రాఘవరెడ్డి జైపాల్ రెడ్డి ఇ శ్రీనివాసులు రాంప్రసాద్ మరియు కానిస్టేబుల్ జయ రాం దాస్ ఆసిఫ్ తిమ్మప్ప సెల్ఫీల బృందాన్ని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు అభినందించారు

Leave a Reply