నకిలీ ఐ.యఫ్.యస్.అధికారి అరెస్ట్..

Share this:

అదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రం లో… ఐ.యఫ్.యస్.అధికారి గా చెప్పుకుంటూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ లు ఇప్పిస్తానని నకిలీ పత్రాలు సృష్టించి ఎంతో మంది నిరుద్యోగులను మోసం చేసిన పర్చే మోహన్ అనే నకిలీ ఐ.యఫ్.యస్.ను పోలీస్ లు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా యస్.పి.రాజేష్ చంద్ర మాట్లాడుతూ…గత ఏడాది ఫిబ్రవరి నెలలో పర్చే మోహన్ అనే వ్యక్తి బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నట్లు పిర్యాదు రావడం తో అప్పటి నుండి ఈ వ్యక్తి పై నిఘా ఉంచినట్లు…గత ఏడాది నుండి ఈ వ్యక్తి ఎవరికి దొరకకుండా జాగ్రత్త పడ్డా నిన్న గుడిహత్నూర్ పోలీస్ లు అరెస్ట్ చేసినట్లు యస్.పి తెలిపారు.ఇతను తను ఐ.యఫ్.యస్.అధికారి నని చెప్పుకుంటూ బీట్ అధికారి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తన మిత్రుడు సెర్ల నర్సయ్య అనే వ్యక్తి సహాయం తో నకిలీ సర్టిఫికెట్ లు సృష్టించి నిరుద్యోగుల వద్ద నుండి మోసపూరితంగా డబ్బులు తీసుకోవడం జరిగిందని ఇతన్ని మరియు ఇతనికి సహకరించిన నిర్మల్ జిల్లా కేంద్ర వాసి సెర్ల నర్సయ్య వృత్తి జిరాక్స్ సెంటర్ అనే వ్యక్తి ని అరెస్ట్ చేసి వారి వద్ద నిండి 8 లక్షల 60 వేల రూపాయలు,50 వేల విలువగల ప్రింటర్ సామాన్లు జప్తు చేయడం జరిగిందని…ఈ కేసులో పురోగతి సాధించి నకిలీ ఐ.యఫ్.యస్.అధికారిని పట్టుకున్న సీఐ మరియు సీసీఎస్ పోలీస్,యస్.హెచ్.ఓ.గుడిహత్నూర్ లను యస్.పి.అభినందించారు..ఈ సందర్భంగా యస్.పి జిల్లా ప్రజలు మరియు నిరుద్యోగ యువత ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని ఉన్నత చదువులు చదివి ఇంటర్వ్యూ కి వెళ్ళితేనే ఉద్యోగాలు వస్తాయి కాని ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.ఒక వేళా మీకు జాబ్ లు ఇప్పిస్తామని ఎవరైనా కాల్ చేసిన అందుబాటులో ఉన్న పోలీస్ అధికారులకు తెలపాలని,మోసపూరిత ప్రకటనల లింక్ లు పంపించి క్లిక్ చేయమన్నా క్లిక్ చేయవద్దని ఒక వేళా క్లిక్ చేసినా పోలీస్ లకు సమాచారం అందిస్తే 24 గంటల్లో మీరు డబ్బులు నష్టపోకుండా చూస్తామని అప్రమత్తంగా ఉండాలని.. జిల్లా యస్.పి.రాజేష్ చంద్ర ప్రజలను కోరారు

Leave a Reply