నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి- బిజెపి మాజీ రాష్ట్ర కౌన్సిలర్ నెంబర్ ఇవూరి నాగేశ్వరరావు

Share this:

కల్లూరు మండల పరిధిలో చిన్నకోరుకొండి గ్రామ పంచాయతీ నందు దాదాపు 450 ఎకరాలు మిర్చి పండిస్తున్న రైతులు ఉన్నారని, అనూహ్యంగా పంటకు ఆశించిన పురుగు వల్ల నూటికి 60 శాతం రైతులు నష్టపోయారని వెంటనే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని, బిజెపి మాజీ రాష్ట్ర కౌన్సిలర్ నెంబర్ ఇవూరి నాగేశ్వరరావు మిర్చి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం కోసం వచ్చిన అధికారులను ఆయన కోరారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, పంట చేతికందే సమయంలో పురుగు ఆశించి ఆత్మహత్యకి పాల్పడుతున్న రైతులను తక్షణం ప్రభుత్వమే ఆదుకొని వారికి ఆర్థిక సహాయం అందించి చేయూతనివ్వాలని అన్నారు. ఇటీవల కాలంలో తామర పురుగు ఆశించి అర్ధాంతరంగా పంట నష్ట పరిచి, రైతులను ఇబ్బందుల్లో కూరుకుపోయెలా చేసిందని అన్నారు. సంబంధిత అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని సూచించారు. చిన్న కోరుకొండి గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన దారుక బంజరకు చెందిన శరత్ అనే రైతు ఇప్పటికీ ఆరు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మిర్చి వేయడం జరిగిందని, తామర పురుగు ఆశించి నష్టపోవడంతో రెండు ఎకరాలలో మిర్చిని తొలగించి దున్నడం జరిగిందని, మిగతా పంట కూడా చేతికి వస్తుందో, రాదో తెలియక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో చాలా మంది రైతులు కూడా ఇదే పరిస్థితి అన్నారు. పంట నష్టపోయిన తీరును అక్కడకు వచ్చిన అధికారులు డి హెచ్ ఎస్ ఓ అనసూయ, సైంటిస్ట్ రవికుమార్, హార్టికల్చర్ మీనాక్షి అగ్రికల్చర్ ఏవో రూప పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పంట నష్ట తీరును వివరించడం జరిగింది. ఇటీవల కాలంలో ఇండోనేషియా నుండి ఇండియాకు కు వచ్చిన కొత్త తరహా తామర పురుగు పంట నష్టపోవడానికి కారణమని తెలిపారు. ప్రస్తుతం పనితీరు, దేని పై దాని ప్రభావం ఎక్కువగా పడుతుందో అదేవిధంగా దాని నివారణకు ఇటువంటి మందులు వాడాలో అనే అంశాలపై పూర్తిస్థాయిలో పరిశోధన జరుగుతుందని పూర్తి వివరాలు రావడంతోనే రైతులకు సూచించి పంట నష్టం జరగకుండా చూసే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply