నాసిరకంగా ఎన్ హెచ్ ప్యాచ్ వర్క్ పనులు

Share this:

జాతీయ రహదారి నెంబరు 216 పై మండవల్లి తదితర గ్రామాల పరిధిలో గుంతల పూడ్చివేత పనులు నాసిరకంగా జరుగు తున్నాయని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల కమిటీ బాధ్యులు ఎల్.ఎస్. భాస్కరరావు టి. అప్పారావు10 వార్డు మెంబర్ పసుపులేటి నాంచారయ్య తదితరులు ఆరోపించారు. సోమవారం మండవల్లి లో జరుగుతున్న ప్యాచ్ వర్క్ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు మండవల్లి తదితర గ్రామాల పరిధిలో జాతీయ రహదారిపై అడుగడుగునా గుంతలతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారిందన్నారు. ఎట్టకేలకు నిధులు విడుదల అవటంతో ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్ ప్యాచ్ వర్క్ పనులు నాసిరకంగా చేపట్టడంతో తారు వేసి వేయగానే రాళ్లు లేచి ధ్వంసమవుతోంది. పనులు జరిగే సమయంలో ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు ఎవరూ లేకపోవడంతో పనులు తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారు. అధికారులు లేకుండా పనులు ఎలా చేస్తున్నారని కాంట్రాక్టర్ గుమస్తాల ను ప్రశ్నించగా ఆదివారం సెలవు కాబట్టి అధికారులు ఎవరూ రాలేదని తెలిపారు. గుంతలను కొంచెం లోతుగా తవ్వి వేయాల్సి ఉండగా తవ్వ కుండా సరిగా మట్టిని కూడా తొలగించకుండా కొన్నిచోట్ల తారును కూడా సరిగా వేయకుండా వదిలేస్తూ పొడలు పొడలు గా వేస్తున్నారని దానిపై తక్కువ మందంలో తారు కంకర వేస్తుండడంతో వేసిన తారు వాహ నాల బరువుకు లేచి పోతుందన్నారు. కొన్ని గుంతలను వదిలేసి కొన్ని గుంతలను మాత్రమే పోల్చడం వల్ల ప్రయోజనం ఏముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించి నాణ్యతతో ప్యాచ్ వర్కులు జరిగే విధంగా చూడాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply