నిరుద్యోగులకుబాసటగా టిఆర్ఎస్ ప్రభుత్వం

Share this:

దేవరకొండ(V3News) 10-04-2022: టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తుండడంతో నిరుద్యోగులను పరీక్షలకు సన్నద్ధం చేయడం కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్ ను ఈనెల 14 నుండి దరఖాస్తులు స్వీకరించి 15 నుండి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోలీస్ ఎస్ ఐ ఉద్యోగం కోసం ఉచితంగా అరకొండ పట్టణంలోని ట్రైబల్ గురుకుల పాఠశాల వద్ద వంద రోజులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈవెంట్స్ 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారని ఉచితంగా మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హనుమంతు వెంకటేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మారుపాకసురేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేష్, కౌన్సిలర్లు భూదేవి సైదులు,జయప్రకాష్, రైస్, బొడ్డుపల్లికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply