నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను వినియోగించు కోవాలి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

Share this:

వరంగల్(V3News): మెగా జాబ్ మేళా (MEGA JOB FAIR)ను వినియోగించు కోవాలన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. బుధవారం కాకతీయ యూనిర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మార్చి 27న హంటర్ రోడ్డు,వరంగల్ పబ్లిక్ స్కూల్ లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం మెగా జాబ్ మేళా(MEGA JOB FAIR)ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ మేళాలో సుమారు 20 ప్రముఖ కంపెనీలు జియే, ఆదిత్య, ఇండిగో, తదితరలు పాల్గొంటాయన్నారు తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతుందని అన్నారు. విద్యా, వైద్యం, ఐటి పరిశ్రమలకు హబ్ గా మరిందని అన్నారు. అందులో భాగంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఇది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అన్నారు ఈ అవకాశాన్ని యువత వినియోగించు కోవాలన్నారు.

వరంగల్ పశ్చిమ ప్రజల సౌకర్యార్థం వాక్ అండ్ టాక్ మీ ఎమ్మేల్యే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రేపు ఉదయం నుండి రోజుకు ఒక్క ప్రాంతంలో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి వారితో స్వయంగా మాట్లాడుతానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం వారితో పాటు వాక్ చేస్తూ వారి సమస్యలు పరిష్కారం కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సాధ్యమైనంత వరకు వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.
అంతరం మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply