నిరుపేద వంశారాజ్ లను ప్రభుత్వం ఆదుకోవాలి : బండారి యాదగిరి

Share this:

మన్సూరాబాద్, v3 న్యూస్ : గ్రేటర్ హైదరా బాద్ పరిధి లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని షిరిడీ సాయి నగర్ వీరన్న గుట్టలో వంశ రాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ఆదివారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సుమారు 40 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నూనె, పప్పు తదితర సరుకులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వంశ రాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండారి యాదగిరి మాట్లాడుతూ…కరోనా వల్ల పేదల బ్రతుకులు మరింత దుర్భరంగా మారాయన్నారు. తమ పరిధిలో నిరుపేదలకు సాయం చేశామన్నారు. కరోనా వల్ల కకావికలమైన నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్యామల ఎల్లస్వామి, మంగయ్య, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply