నిర్మల్ జిల్లా పోలీసుల కార్యాలయంలో అమర వీరుల వీడియో సిడి ఆవిష్కరణ

Share this:

నిర్మల్: సమాజం, దేశం కొరకు త్యాగాలు చేసిన వారిని ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారని, ఇటువంటి అమరత్వాన్ని పొందిన పోలీసుల స్మృతిలోనే అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్ డే జరుపుకుంటున్నామని జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన పోలీసు వీరులను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహించే పలు కార్యక్రమాలలో భాగంగా నేటి (బుధవారం) ఉదయం జిల్లా పోలీసుల కార్యాలయంలో అమర వీరుల వీడియో సిడిని జిల్లా ఎస్పీ గారు ఆవిష్కరించారు.

ఈసందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…పోలీసు విధి నిర్వహణ పెను సవాళ్ళతో కూడుకున్నది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించ చూసే విచ్చిన్నకర శక్తులను అణిచివేస్తూ, ప్రజలకు శాంతిని అందించే గురుతర బాధ్యత పోలీసులపై ఉంటుంది. సరిహద్దులు, మన చుట్టూ ఉన్న సమాజంలో ఉండే టెర్రరిస్టులు, సంఘవిద్రోహులను కట్టడి చేసే క్రమంలో ప్రతి ఏడాది వందలాదిమంది పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారు. మనకు శాంతియుత వాతావరణం అందించేందుకు విలువైన తమ ప్రాణాలను అర్పించిన పోలీసు వీరుల ఋణం తీర్చుకోలేనిది. వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి అర్పించడంలోనే ఆత్మశాంతి కల్పించినవారము అవుతాము.
ప్రజల సహకారంతో దుష్టశక్తులను అణిచివేస్తూ అభివృద్ధి వైపు పయనించేందుకు పోలీసులు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటారు. అమర పోలీసు వీరుల స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా, నిష్ఠగా శాంతి యజ్ఞంలో మీ పోలీసు పని చేస్తుందని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ.రాంరెడ్డి గారు, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, డిఎస్పీ జీవన్ రెడ్డి, డిసిఅర్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆర్ఐ వెంకటి, యంటిఓ వినోద్, పాట ఎడిటర్ చెనిగారపు నాగరాజు, గాయకుడు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply