నూతన ఉత్సాహంతో పని చేయాలి!-హనుమకొండ కలెక్టర్!!

Share this:

ఉద్యోగులందరూ నూతన సంవత్సరంలో ఉత్సాహంతో పని చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని, అభివృద్ధిలో హనుమకొండ జిల్లా ను అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రాంగణం లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసి, టీఎన్జీవోస్ యూనియన్ 2022 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులకు కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ నూతన జోనల్ విధానంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగుల కేటాయింపులు పారదర్శకంగా జరిగాయని పేర్కొంటూ ఉద్యోగుల పక్షాన జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మేడం డి ఆర్ డి ఓ వాసు చంద్ర ఉద్యోగుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంల టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షులు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేష్,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్, రాము నాయక్, షఫీ, సలీం, చీకటి శ్రీనివాస్, మోయిస్, రాజమౌళి ,సురేష్, రవి ప్రసాద్, రాజ్యలక్ష్మి, సింధు రాణి, లక్ష్మీ ప్రసాద్, కుమార్, రామ్ ప్రసాద్, అనంతుశ్రీనివాస్, భగవాన్ రెడ్డి, జిలుకర రమేష్,గౌతమ్ ,మిస్బా, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply