నేషనల్ ఆయుష్ మిషన్ వైద్యులు ఉచిత వైద్య వైద్య శిబిరం

Share this:

ముస్తాబాద్ (V3News ): ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో డాక్టర్ బి ఆర్ కే ఆర్ వైద్య కళాశాల వైద్యులు డాక్టర్ లక్ష్మి కాంత్ ఆధ్వర్యంలో నేషనల్ ఆయుష్ మిషన్ వైద్యులు ఉచిత వైద్య వైద్య శిబిరం మూడు రోజులుగా కొనసాగి శనివారం ముగిసింది.ఈ శిబిరంలో కళాశాల విద్యార్థుల చేత ఇంటింటి సర్వే నిర్వహించారు అన్ని రకాల జబ్బులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, వంటింట్లో గల ఆహార ద్రవ్యాలు ఏ జబ్బులకు మందులు వాడుతారు.అని తెలుసుకున్నారు.. ఔషధ మొక్కలు మానవ జీవన శైలి మార్పు చేయుటలో ఔషధాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుట యోగ తప్పనిసరి అని గ్రామంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అనంతరం గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం శ్రీకారం చుట్టి 10 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ముస్తాబాద్ మండలం లోని మా పోతుగల్ గ్రామం కు అవకాశం దక్కడం సంతోషకరమని అన్నారు ఆయుర్వేదిక్ వైద్య కళాశాలలో వైద్యనిపుణులు ఇంటింటా తిరిగి పరీక్షలు నిర్వహించి విధులు నిర్వర్తించిన వైద్య బృందం వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వైద్యుల నుశాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పోతుగల్ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు , పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు , తెలంగాణ రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , ఎంపీటీసీ కొండని బాలకిషన్, గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక బాల్ నర్స్ గ, ముస్తాబాద్ మండల్ బీసీ సెల్ అధ్యక్షులు గిస శంకర్ , ఉప సర్పంచ్ నాంపల్లి మంజుల రమేష్ , గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కేసుగాని అనిల్ , గ్రామ పంచాయతి సెక్రటరీ ఆఫర్ , విఆర్వో సత్యానందం , గ్రామపంచాయతీ పాలకవర్గం, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, మరియు ప్రజలు, విఆర్ఎలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ లక్ష్మి డాక్టర్ విశ్వంత్, డాక్టర్ అరుణ, డాక్టర్ శ్రీధర్, శ్రీనివాస్ ఫార్మసిస్ట్ శ్రీనివాస్ సృజన కళాశాల విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply