పంచాయతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

Share this:

ఖమ్మం: అశెశ భక్త జన సమక్షంలో పంచాయతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఖమ్మం రూరల్ మండలం కాచిరాజు గూడెం గ్రామంలో గల అతి పురాతన దేవాలయంలో కొలువుదీరిన శ్రీ సీతా రామ లింగేశ్వర స్వామి కి ప్రత్యేక పుజలు నిర్వహించారు అనంతరం పంచాయతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్త మంచికంటి సునీత తిరుమలరావు తెలియజేశారు పర్యవేక్షణలో పంచాయతన మహోత్సవం కొనసాగింది వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న అలయం లొ జరిగిన ఆధ్యాత్మక కార్యాన్ని తిలకించేందుకు భక్త జనం వివిద గ్రామాలనుంచి తరలి వచ్చారు ఈ సందర్భంగా అలయ ధర్మ కర్త మాట్లాడుతూ గత వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం నందు టీటీడీ బృందంచే శ్రీ ఆదిత్య, అంబికా, గణనాథ విష్ణు ,మహేశ్వర, పంచాయతన విగ్రహ మహోత్సవ కార్యక్రమం మూడు రోజులు జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ విగ్రహ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొదటిరోజు ప్రముఖ సీనియర్ న్యాయవాది , కిట్స్ విద్యాసంస్థల చైర్మన్ నీరంజన్ రెడ్డి పుష్పలత దంపతులు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు… ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలయం100 ఏండ్ల చరిత్ర కలిగి ఉన్నదని భక్తులు ఏలాంటి కోరికలు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి అని ప్రభుత్వం దృష్టి సారించి దేవాలయాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుబ్బారావు శాస్త్రి, మణి కుమార్ శర్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Leave a Reply