పాస్ పోర్ట్ కేసులో ఎంపీ సోయం బాపూరావు నిర్దోషి-తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయస్థానం

Share this:

ఎమ్మెల్యేల వీసాపై విదేశాలకు అక్రమంగా ఇతర కుటుంబ సభ్యులను తరలిస్తున్నారన్న అభియోగం పై కేసును ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కు ఊరట లభించింది. కేసు విచారణలో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో సోయం బాపురావ్ నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కేసు పూర్వాపరాల లోకి వెళ్తే… బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సోయం బాపురావు తనకున్న వీసా పాస్పోర్ట్ లను దుర్వినియోగం చేస్తూ ఇతర దేశాలకు మనుషులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న అభియోగంపై 2007 లో సీసీఎస్ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై 2017 లో సోయం బాపురావు గారిపై చార్జిషీట్ దాఖలైంది. కేసు విచారణలో భాగంగా అభియోగాలు ఎదుర్కొన్న ఎంపీలు ఎమ్మెల్యేల విచారణ నిమిత్తం అం 2019లో స్పెషల్ కోర్టు కు ఈకేసును బదిలీ చేశారు. ఈ కేసులో సోయం బాబురావు పై విచారణలో భాగంగా 33 మంది సాక్షులను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచి వాదనలు స్వీకరించగా.. సోయం బాపురావు గారి తరపున న్యాయవాది వి. సురేందర్ రావు వాదనలు వినిపించారు. పాస్పోర్ట్ కేసులోఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో సోయం బాపురావు ను నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది.
……..
సోయo బాపురావు గారికి కేసులో ఊరట లభించడంతో ఈ తీర్పుపై ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, బిజెపి కార్యకర్తలు, అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Leave a Reply