పెద్దపల్లి జిల్లాలో 7వ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన వర్కర్స్ నిరవధిక సమ్మె

Share this:

పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు మోడల్ స్కూల్ లలో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న వర్కర్స్ డిసెంబర్ 1వ తేది నుండి జిల్లా వ్యాప్తంగా సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు. జిల్లా మధ్యాహ్న భోజన ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్, CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఐ రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యుడు గౌతమ్ గోవర్ధన్,వర్కర్ ఎనగంటి పద్మ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ & మోడల్ స్కూల్ లలో 921 మంది మధ్యాహ్న భోజన వర్కర్స్ గత 20 సం,,లుగా విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తూ తమ విధులు నిర్వహిస్తున్నామని రెండు దశాబ్దాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పతకాన్ని నిరాఘాతంగా కొనసాగేందుకు ఎన్నో వ్యయప్రయాసలకు, ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నా సకాలంలో ఆహారాన్ని అందిస్తున్నా వంట కార్మికులకు శ్రమకు తగిన ఫలితం లేదనీ . రూ.1000/- అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్నామని పెరిగిన నిత్యవసర వస్తువులు నూనె, పప్పు, కూరగాయలు, కట్టెలు, గ్యాస్ రేట్లు ఆకాశాన్ని అంటినాయి. ప్రభుత్వం చెల్లించే మెస్ బిల్లులకు కట్టెలు కూడా రావడం లేదు. ఈ పరిస్థితులలో మధ్యాహ్న భోజనం నిర్వహించలేము. అక్టోబర్ నెలలో 20 తేది నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా వంటలు నిలిపి వేసి 11 రోజులు సమ్మె నిర్వహించి విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రా రెడ్డినీ కలిసి విన్నవించుకొని దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికి ఎలాంటి స్పందన ప్రభుత్వం నుండి రాలేదు. ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనంతో మెస్ బిల్లులలో ఈ మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడం సాధ్యం కావడం లేదు. అందువలన సమ్మె తప్పడం లేదు. డిసెంబర్ 1వ తేది 2021 నుండి తిరిగి సమ్మె జరుగుతుంది. సమ్మె 7 రోజులకు చేరినప్పటికీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురుస్తున్న చందంగా ఉంది. బంగారు తెలంగాణ అని చెప్పిన కె.సి.ఆర్. గారు ప్రభుత్వ పాటశాలలోని విద్యార్ధులకు భోజనం వండి పెట్టె వర్కర్స్ కి కనీస వేతనం ఇవ్వడం సాధ్యం కావడం లేదా? రేపటి పౌరులకు 4.97 పైసల లో పౌష్టిక ఆహారం ఇవ్వగలుగుతారా సంస్తులకు జైలులో చికెన్, మటన్, కోడిగ్రుడ్లతో భోజనం అందిస్తుంది కానీ విద్యార్ధులకు వట్టి కూరగాయల భోజనమేనా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. పెద్దపల్లి జిల్లాతో ప్రారంభం అయిన సమ్మె కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాలకు సమ్మె సెగ తగిలింది. JAC ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వర్కర్స్ సిద్ధం కావాలి అని మధ్యాహ్న భోజన వర్కర్స్ ను కోరుచున్నాను.

డిమాండ్స్:

1) కనీస వేతనం రూ.11,700/- ఇవ్వాలి.

2) కోడిగ్రుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలి.

. 5) ప్రతి నెల మెస్ బిల్లులు & వేతనం 5వ తేది లోపు చెల్లించాలి.

3) వంట పాత్రలు & గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఉచితంగా సరఫరా చేయాలి

4) పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు చెల్లించాలనీ డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో రమ దేవి, స్వరూప, జుబేదా, సరోజ, రత్న మాల, శాంత, ఎల్లమ్మ, స్వరూప, సరిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు….

Leave a Reply