పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల సర్వసభ్య సమావేశం

Share this:

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల సర్వసభ్య సమావేశం అంతర్గం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది.సభ్యులు పలు సమస్యలను అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శుద్ధ గోదావరి జలాల మంచినీటి పథకం మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న మంచినీరు మండలంలోని గ్రామాల్లో సక్రమంగా రావడం లేదని ప్రజలు తమ ఇళ్ల ముందు ఆందోళన చేస్తూ నిలదీస్తున్నారన్నారు. అధికారులు నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజా ప్రతినిధులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాల అమలు తీరుపై ఆకెనపల్లి గ్రామ సర్పంచ్ మేర్గు పోచం, ముర్మూర్ ఎంపీటీసీ కొక్కెర రమేష్ నిలదీశారు. రైతులకు సకాలంలో నాణ్యమైన యూరియా అందించడంలో అధికారులు, ప్రభుత్వం విఫలమైందని రైతు వేదికలు నిరుపయోగంగా మారాయని ఆరోపించారు. ట్రాన్స్కో అధికారులు లూప్ లైన్ లను సరిచేయాలని పలుమార్లు దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వెంటనే జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. కాగా పలు అంశాలపై చర్చలు జరిగినప్పటికీ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనివార్య కారణాల వల్ల సభకు గైర్హాజరు కావడంతో సర్వసభ్య సమావేశం నామమాత్రం సాదాసీదాగా కొనసాగింది.

అంతర్గాం మండల ఎంపీపీ దుర్గం విజయ రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్ సంపత్ కుమార్, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్మి, ఎంపీఓ సమ్మిరెడ్డి, ఎంఈఓ దాసరి లక్ష్మీ, ఆయా శాఖల అధికారులు రాజ్ కుమార్, రహమతుల్లాఖాన్, దర్ని రాజేష్, బాధరవేని స్వామి, మురళి, రాంబాబు, రవీందర్, సురేష్, శ్రావణ్, రాజు, నర్సమ్మ, పుష్పలత, రమేష్, జె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply