పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యత : అదనపు ఎస్పీ నర్మద

Share this:

నల్లగొండ, V3 న్యూస్ : కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవడం ఒక సామాజిక బాధ్యత అని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణ శివారులోని రాంనగర్ ఎస్.సి. కాలనీలోని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఆమె మాట్లాడుతూ నిజమైన అర్హులకు అందిస్తున్నందుకు మనసుకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందన్నారు. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కుదిపివేస్తోందని, ఇలాంటి విపత్కర పరిస్థితులలో తోటివారి పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం ప్రదర్శించాలన్నారు. సుమారు 90 కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసరాలు అందించినట్లు ఆమె తెలిపారు.

Leave a Reply