పైడిపల్లి దర్గాను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేస్తాం…వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్

Share this:

పైడిపల్లి దర్గాను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేస్తామని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు.పైడిపల్లి లోని హజ్రత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రీబాబా రహ్మాతుల్లాహ్ లే దర్గా ఉత్సవాలలో భాగంగా దర్గా పీఠాధిపతి మహ్మద్ అంకుషావళి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ఆదివారం హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ పైడిపల్లి దర్గాను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ నగర డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను షీభారాణి అనిల్ కుమార్,కార్పొరేటర్ అరుణ సుధాకర్,తెరాస నాయకులు ఆదమ్,ఉస్మాన్,బోనాల సల్దాన్,3వ డివిజన్ యూత్ అధ్యక్షుడు ల్యాదేళ్ల రమేష్ పాల్,మోసిన్,రాజు,భక్తులు తదితరులు,పాల్గొన్నారు.

Leave a Reply