పొద్దుటూరు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం మహోత్సవం

Share this:

వలిగొండ(V3News): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వలిగొండ మండల పరిధిలో అతిపురాతన మహిమగల శివాలయం కావడంతో గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కోరిన కోరికలను కొంగుబంగారంగా తీర్చే ఈ మహిమ గల శివాలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పాలాభిశేకాలు స్వామివారి హారతిలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో కోవిడ్ నియమ నిబంధనలతో ప్రతి ఒక్కరు ఉపవాస దీక్ష చేస్తూ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం రోజున ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు రుద్రాభిషేకం, సర్వదర్శనాలు,రుద్రహోమం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు సోలిపురం శ్రీకాంత్ రెడ్డి, బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి,పగడాల అశోక్, గ్రామ సర్పంచ్ గరిసె నర్సమ్మ నర్సిహ్మ, ఉపసర్పంచ్ దుబ్బ మౌనిక రామకృష్ణ,మాజీ సర్పంచులు ఏలే పద్మ కృష్ణ, దుబ్బ లత లింగం,మాజీ ఎంపిటిసి భూమి మాధవి బాల శంకర్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పల్సం పూలమ్మ బాలయ్య, వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply