పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వారితో మమేకం కావాలి- రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి.

Share this:

పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వారితో మమేకమై విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఐజి అన్నారు. బుధవారం బసంతనగర్ ఎస్ఐ మహేందర్ రెండు నెలలుగా బసంతనగర్ పోలీస్ స్టేషన్ ఆధునికీకరణ పనులు, హంగులు, పచ్చని గడ్డితో పాటు వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేసి ఆధునీకరించిన బసంతనగర్ పోలీస్ స్టేషన్ ను రామగుండం సిపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అధికారులతో కలిసి సందర్శించి ఆహ్లాదభరితంగా తయారు చేసిన పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ బసంతనగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం లో 5-ఎస్ ఇంప్లిమెంట్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ను 17 భాగాలుగా విభజించి కానిస్టేబుల్ స్థాయి అధికారి నుండి ఎస్ఐ ల వరకు ఒక్కొక్క విభాగానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి, పోలీస్ స్టేషన్ ను బసంతనగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం యాజమాన్యం సహకారంతో పోలీస్ స్టేషన్ ను ఆహ్లాదభరితంగా, సుందరంగా తీర్చిదిద్దారన్నారు. ఠాణాకు వచ్చే వారు సేదతీరేందుకు ప్రత్యేకంగా బెంచీలు, పోలీస్ వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక షెడ్డు నిర్మించారు.
పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు మొక్కలతో ఉండటంతో స్వచ్ఛమైన గాలి వస్తుందని పోలీస్‌ అధికారులు, సిబ్బంది, ప్రజలు స్వచ్చమైన గాలిని పీల్చుకుంటారు అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం పోలీస్ స్టేషన్ లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ స్టేషన్ ఆవరణ ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్ది వివిధ రకాల పూల మొక్కలు, పెద్ద ఎత్తున నాటడం తో పచ్చదనం వెల్లివిరుస్తోంది అన్నారు. బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో 5S ఇంప్లిమెంటేషన్ పక్కాగా అమలు జరుగుతోందని, స్టేషన్ లోని విధులు వర్టీకల్స్ వారిగా ఒక్కొక్కరికి ఒక్కో వర్టికల్ విభాగాన్ని అప్పగించడంతో ఫైళ్ల క్రమబద్ధీకరణ వేగవంతంగా జరగడంతో పాటు పనితీరు మెరుగుపడిందని, దీంతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతున్నాయి అన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించాలని, వారి సమస్యలను ఓపికగా తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచించాలని పేర్కొన్నారు. పోలీస్‌ స్టేషన్‌ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్‌ స్టేషన్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు.
గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించి గంజాయి రహిత కమిషనరేట్ గా రామగుండం ను తీర్చిదిద్దుతామని పోలీస్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి అన్నారు. గంజాయి నియంత్రణ కోసం ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. గంజాయి వంటి మత్తుపదార్థాల నియంత్రణకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాల వాడకం వల్ల యువత బంగారు భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని, వీటి నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, యువకులకు, విద్యార్థులకు గంజాయి వాడకం వల్ల జరిగే నష్టాల తోపాటు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్వరలోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సత్వరమే సమాచారం పోలీస్‌ స్టేషన్‌కు చేరేలా సమాచార వ్యవస్థను ఏర్పర్చుకోవాలన్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పరచుకొవాలని, చట్టవ్యతిరేకమైన అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల సమస్యలు చట్టపరిధిలో పరిష్కరిస్తూ వారి మన్ననలను పొందాలని అన్నారు.పోలీస్ స్టేషన్ ను మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలాగా ఏర్పాటుకు కృషి చేసిన ఏసిపి సారంగపాణి, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ మహేందర్, కె.శివానిరెడ్డి లను, సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి పి.రవీందర్, సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, బసంతనగర్ కేశోరాం ప్లాంట్ హెడ్ రాజేష్ గర్గ్, ఏవిపి గోవిందరావు, తదితరులతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply