పోషక విలువలతో కూడిన, రసాయనాలు లేని వ్యవసాయం వైపు రైతులు ఆలోచించాలి-నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి

Share this:

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఆమ్రద్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు చిన్ని కృష్ణుడు నిర్వహించనున్న దేశి వరి విత్తన బ్యాంకు ప్రారంభోత్సవాన్ని కలెక్టర్ గురువారం నాడు ప్రారంభించారు. డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన రైతు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు లేనిది రాజ్యం లేదని, రైతే దేశానికి వెన్నెముక అని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న చిన్ని కృష్ణుడు ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ దిశగా ఇంకా ముందుగా వెళ్లవలసిన అవసరం ఉండదని తెలుపుతూ తద్వారా ముందు తరాలకు ఒక ఆరోగ్యకరమైన మంచి మార్గాన్ని చూపించిన వారం అవుతామని తెలిపారు. రైతు లాభసాటి వ్యవసాయం చేసినప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధిలో ముందుంటుందని అన్నారు. 5 సంవత్సరాల క్రితం ఉమ్మడి జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే దని ప్రస్తుతం కేవలం నిజామాబాద్ జిల్లాలోని ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నారని మూడు రెట్లు ఉత్పత్తి పెరిగిందని పేర్కొన్నారు తద్వారా రైతు ఆదాయం పెరిగిందన్నారు. అయితే తే.గీ దు సంవత్సరాల క్రితం 14 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉపయోగించగా ప్రస్తుతం ఒక్కొక్క సీజన్కు 78 వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతున్నామని ప్రతిరోజు ఒక రైలు రేకు తెప్పించవలసి వస్తున్నదని యూరియా అంతా నేలకు, నేలనుండి పంటకు, పంట నుండి ఆ పంటలు తినే మన శరీరంలోకి వెళ్లడం ద్వారా అనారోగ్యం ఏర్పడుతుందన్నారు. జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం మనుగడ బాగుంటుందని, అభివృద్ధి పథంలో నడుస్తుందని, దానికోసం ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన రైతులకు సూచించారు. అంతేకాక రసాయనిక ఎరువులతో పండించే పంటలకు పోషక విలువలు తక్కువగా ఉంటాయన్న కారణంతో యూ. కె. యూఎస్ఏ. తదితర దేశాలు మన ధాన్యాన్ని కొనడానికి ఇష్టపడరని, అందువల్ల ఇతర దేశాల్లో మన ధాన్యానికి డిమాండ్ రావాలంటే ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని చేయవలసిన అవసరం ఉన్నదన్నారు. ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని తీసుకునే అవకాశాలు లేనందున రైతులు ఆలోచించి డిమాండ్ ఉన్న పంటల సాగుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన కోరారు. ఇతర పంటల సాగుకు అవకాశం ఉన్న చోట ఆ దిశగా రైతులు ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఇతర జిల్లాలలో కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతు దంపతులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహించగా, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply