ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం

Share this:

ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం ఇవ్వాల్సి వస్తుంది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుసటి రోజే పాదయాత్ర ప్రారంభిస్తా.
21 రోజులు 6 నియోజకవర్గాలు, 150 గ్రామాల్లో చేసిన పాదయాత్రలో వందల సమస్యలు చూశాం. పెన్షన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు,పలు రకాల ప్రజా సమస్యలు, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాము.వరి కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పడం భావ్యమా.రైతుల కోసం ఎన్నో చేస్తే ఏడేళ్లలో 8 వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో 91 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారని ఓ సర్వే చెప్పింది. బహిరంగంగా మీడియా సమావేశాల్లోనే కేసీఆర్ నిజాలకంటే అబద్ధాలే ఎక్కువగా చెబుతున్నారు.
కేంద్రం పెత్తనం లేకుండా వరి కొనుగోలు చేస్తామని చెప్పిన కేసీఆర్ చేతకాకుంటే రాజీనామా చేసి దళితుడికి బాధ్యతలు అప్పగించాలి. వరి రైతులకు భరోసా ఇచ్చేందుకు ఈ శుక్రవారం హైదరాబాద్ లో 72 గంటల నిరాహారదీక్ష చేపడుతా.

Leave a Reply