ప్రజా సంక్షేమ పాలన తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యం:-డా౹౹చదలవాడ అరవింద బాబు

Share this:

ప్రజా సంక్షేమ పాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.ఈ రోజు నరసరావుపేట మండలం అర్వపల్లి గ్రామంలోని నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర లో డా౹౹చదలవాడ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం మహిళలు హారతులతో గ్రామంలోకి ఆహ్వానించారు.డా౹౹చదలవాడ అరవింద బాబు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అర్వపల్లి గ్రామం లోని ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అన్ని అర్హతలు ఉన్నా పెన్షన్లు తీసేస్తున్నారని ఆసరా, వృద్ధాప్య పింఛన్లు కక్షసాధింపు చర్యగా తొలగించడం బాధాకరమని ఇటువంటి రాక్షస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అనే చందంగా వ్యవహరిస్తుందని ఒక కుటుంబంలో ఉన్నత విద్యను అభ్యసించే ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటే వారిలో ఒకరికే జగనన్న విద్య దీవెన కింద నగదు మంజూరు చేస్తున్నారని మిగతా విద్యార్థుల చదువులు అగమ్య గోచరంగా మారిందని ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా కుటుంబంలో అందరూ చదువుకుంటారని అలా కాకుండా అమ్మఓడి,విద్యా దీవెన ద్వారా కుటుంబంలో ఒక్కరే చదువుకోవడానికి అవకాశం ఉందని విదేశాల్లో మెడికల్ విద్య తదితర ఉన్నతమైన వృత్తి కోర్సులు చదివించేందుకు గత టీడీపీ ప్రభుత్వం లో అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా చదువుకునే వారని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ ఉన్నత విద్యను చదివే విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదని చాలా మంది విద్యార్థులు వారి చదువులను మధ్యలోనే ఆపేసి ఇంటికి పరిమితమయ్యారని ఎస్సీ లకు సంబంధించిన 17 రకాల స్కీములను రద్దు చేశారని ఎస్సీ,ఎస్టీ,బీసీ,ముస్లిం మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా అందాల్సిన వివిధ రుణాలను కూడా ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆఖరికి గ్రామాలలో కూడా చెత్త పన్నులు విధిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఇదేమని అడిగిన ప్రజలను వారి పై అక్రమ కేసులు పెడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గంలో అమ్ముకుంటున్నారని అవినీతి ఎమ్మెల్యేకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఎవరికైనా అన్ని అర్హతలు ఉండి పెన్షన్ అందకపోతే మా దృష్టికి తీసుకురావాలని రామన్న రాజ్యం- చంద్రన్న తోనే సాధ్యమని ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించి, గ్రామాల అభివృద్ధికి నాంది పలకాలని డా౹౹చదలవాడ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తిరుమల శెట్టి ఏడుకొండలు, పులుసు అప్పారావు, తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, సుబ్బారావు,సీనియర్ నాయకులు పులిమి రామిరెడ్డి,మన్నన్ షరీఫ్,మబు,మీరవాలి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply