ప్రతి ఎకరాకు నష్టపరిహారం ఇచ్చి తక్షణం రైతాంగాన్ని ఆదుకోoడి.

Share this:

తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు, మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, గోపు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రచార కార్యదర్శి, పి.వి. ఫణి కుమార్ లు, ఆదివారం మచిలీపట్నం నియోజకవర్గంలోని కానూరు, తాళ్లపాలెం గ్రామాలలోని రైతులతో కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంట పడిపోయిన పంట పొలాల్లో కి రైతులతో కలిసి వెళ్లి పరిశీలించి, రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు…

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు, మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,గోపు సత్యనారాయణ మాట్లాడుతూ….- అధిక వర్షాలు తుపానుల కారణంగా జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో ఎన్నడూ లేని విధంగా పైర్లు దెబ్బతిని రైతాంగం కోలుకోలేని విధంగా ఉన్నారని, రైతాంగానికి తక్షణమే నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సంవత్సరం వరి, శనగ, పత్తి, ఉల్లి, టమోటా, మిరప, అరటి, చామంతి తో పాటు కూరగాయల తోటలు, పసుపు పెద్ద ఎత్తున దెబ్బ తినడంతో పాటు మిగతా పంటలకు కూడా దెబ్బతిని రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా ప్రశ్నార్థకంగా మారిందని, గోపు సత్యనారాయణ ఆవేదన,ఆందోళన వ్యక్త పరిచారు.

       జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి ఎకరా దెబ్బతిన్నoదున పార్టీలకతీతంగా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పంటలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపి పరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ సంవత్సరం లో పత్తి, శనగ పైర్లు బాగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తపరిచారు. పూర్తిగా చేతికొచ్చిన వరి పంట దెబ్బతిందని దానికి సంబంధించి తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని, ఖరీఫ్ లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రబీలో రైతాంగం వేసుకునే పంటలకు సంబంధించి ఉచితంగా విత్తనాలు, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రచార కార్యదర్శి, పి.వి. ఫణి కుమార్ మాట్లాడుతూ…

ప్రతి ఎకరాకు రైతు 30 వేల రూపాయల నుండి 40 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారని, రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు.

నల్ల వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడం భారతదేశ రైతాంగ విజయం అన్నారు.

దేశానికి వెన్నుముక అయిన రైతు కన్నెర్ర చేస్తే ఎంతటి నియంత అయినా దిగి రాక తప్పదు అనడానికి ఇది నిదర్శనం అన్నారు.

దేశంలో ఇతర ప్రజా సమస్యలపై పోరాటానికి రైతు ఉద్యమం స్ఫూర్తినిచ్చింది అన్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాల్లో అధికారులు అంచనాలు వేసి, ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఈమని శేఖర్, చిట్టి కి నేటి అయ్యప్ప, ఈమని రామాంజనేయులు, బొలిశెట్టి రంగారావు, ఈ. ఆంజనేయులు, పాండు, తదితర రైతులు పాల్గొన్నారు.

Leave a Reply