ప్రభుత్వం పేదల పక్షం:ఎమ్మెల్యే ఆర్కేరోజా

Share this:

చిత్తూరు జిల్లా నగరి: ప్రస్తుతం రాష్ట్రంలో జగనన్న నేతృత్వంలో పేదల పక్షమైన ప్రభుత్వం నడుస్తోందని ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. గురువారం తన నివాస కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో వరద కారణంగా నష్టపోయిన 37 మంది బాధితులకు, స్థాయికి మించి వైద్య ఖర్చులు పెట్టి ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకొన్న 6 గురికి ఆమె ప్రభుత్వం తరపు ఆర్ధిక సాయం అందించారు. వరదతాకిడికి ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్లు లాంటి పెంపుడు మృత్యువాత పడటంతో ఉపాధి కోల్పోయిన 37 మందికి రూ.3,01,500, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 6 గురికి రూ.3,64,000 ఆమె చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విపత్కర పరిస్థితిల్లో ప్రజలను ఆదుకోవడం మనసున్న మనుషులకే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి మనసున్న మనిషి కనుకే వేగంగా సాయం అందుతోందన్నారు. గత ప్రభుత్వాల్లో వరదలు వచ్చే సమయంలో వారు అందించిన సాయం ఎంతో ప్రజలకే తెలుసన్నారు. పేదల పక్షాన నిలబడి ఆయన ఆదుకుంటున్నారు కనుకే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌ , అసిస్టెంట్‌ డైరెక్టర్లు, పశు సంవర్థక శాఖ వైద్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply